120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!

  • భారత్‌లో Lava Aura Curve 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్
  • 6.67 అంగుళాల 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
  • 2.4GHz Dimensity 7100 ప్రాసెసర్‌తో పనితీరు
  • 50MP Sony IMX752 ప్రధాన కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా
  • 6,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • IP64 రేటింగ్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ
  • 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.23,999
  • లావా ఆఫ్‌లైన్ రిటైల్ పార్ట్‌నర్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే విక్రయం..
Lava Aura Curve 5g

Lava Aura Curve 5g

Lava Aura Curve 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) నుండి ఆఫ్‌లైన్ రిటైల్ విభాగం కోసం కొత్త ‘ఆరా’ (AURA) సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా Lava Aura Curve 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. గత నెల ఆన్‌లైన్ మార్కెట్ కోసం ‘Virat Curve’ పేరుతో వచ్చిన ఫోన్‌కు ఇది ఆఫ్‌లైన్ రిటైల్ వెర్షన్‌గా నిలుస్తుంది.

లావా ఆరా కర్వ్ 5జీలో 6.67 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 1920Hz PWM డిమ్మింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో మరో చిన్న AMOLED స్క్రీన్‌ను అందించారు. దీనిపై నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్స్, బ్యాటరీ స్థాయి, కస్టమ్ టెక్స్ట్ వంటి వివరాలను చూడొచ్చు. మొబైల్ వేగవంతమైన పనితీరు కోసం ఈ ఫోన్‌లో 2.4GHz వరకు క్లాక్ స్పీడ్ కలిగిన MediaTek Dimensity 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 6GB LPDDR5 RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. వీటికి తోడుగా 6GB వర్చువల్ RAMను పొందవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో థర్డ్ పార్టీ బ్లోట్‌వేర్, ఇంటిగ్రేటెడ్ యాడ్స్ లేకుండా క్లీన్ ఇంటర్‌ఫేస్ అందించారు.

కెమెరాల విషయానికి వస్తే.. వెనుక 50MP Sony IMX752 ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ ఉన్నాయి. ఇది 2K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ప్రో వీడియో, నైట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, మోషన్ ఫోటో, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. 6,000mAh కెపాసిటీతో కూడిన బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే రిటైల్ బాక్స్‌లో 33W ఛార్జర్‌ను అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 720 గంటల వరకు స్టాండ్‌బై సమయం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

డిజైన్ పరంగా కూడా వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిష్‌ను అందించారు. ఈ ఫోన్ అంబర్ బ్లూ, హిమ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. Al-Si DT Star 2 కవర్ గ్లాస్, IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీని కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్లు ఉన్నాయి. లావా తన Vayu AI ఫీచర్లను కూడా ఇందులో అందించింది. అలాగే రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

ధర విషయానికి వస్తే.. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా లావా ఆఫ్‌లైన్ రిటైల్ పార్ట్‌నర్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే అమ్మబడుతుంది. కొనుగోలుదారులకు ‘Free Service @ Home’ పేరుతో దేశవ్యాప్తంగా డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.