NTV Telugu Site icon

T. Harish Rao: నారాయణ్ ఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు

Harish Rao

Harish Rao

పట్ట భద్రుల సీట్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. “రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీ గెలిపించాలి. కాంగ్రెస్ పాలనాలోఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. రైతాంగాన్ని నిలువునా మోసం చేసింది. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్, అమలు చేసుడు విస్మరించింది. విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు తో బుద్ధి చెప్పాలి. ఉపాధ్యాయులపై నారాయణ ఖేడ్ లో లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు. వడ్లకు బోనస్ ఎగ గొట్టిన కాంగ్రెస్ రైతు బిడ్డలు బుద్ధి చెప్పండి. సంక్షేమ పథకాలలో కోతలు, ధరలు పెంచి వాత పెడుతున్న రేవంత్ కు విద్యా వంతులు బుద్ధి చెప్పాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Hyderabad Roads: హైద‌రాబాద్ రోడ్లపై వర‌ద నీటిలో కూర్చుని మ‌హిళ నిర‌స‌న‌..

కరెంట్, రిజిస్ట్రేషన్ ఫీజు, భూముల ధరలు పెంచాలనే యోచన చేస్తుందని తన్నీరు హరీష్ రావు అన్నారు. ” తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది. ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేయాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ కి వాత పెట్టాలి. తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ ను బలపర్చాలి. తెలంగాణ ఉద్యమ కార్లపై తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్ కు పట్ట భద్రులు ఓటు వేయొద్దు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలి. తెలంగాణ నీళ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించాలని బీజేపీ కుట్రలకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోంది. 2వేల పడకల ఆసుపత్రి చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ చిహ్నం ను తొలగించాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పంటలు కోనేటోళ్ళు లేరు, కరెంట్ సరఫరాలో విఫలమయ్యారు. కాంగ్రెస్ అబద్దాలు, మోసాలను ప్రశ్నించడం రాకేష్ రెడ్డి కి సాధ్యం?” అని హరీష్ రావు పేర్కొన్నారు.