Devara 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Read Also:Story Board: ఎవరికి బెనిఫిట్..? ఎందుకు బెనిఫిట్..?
దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అక్కడ కూడా దేవర దండయాత్ర చేశారు. ఓటీటీలో కూడా ట్రెండింగులో నిలిచింది. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ గత కొన్ని వారాలుగా దాని మీదే పని చేస్తు్న్నాయి.
Read Also:Off The Record: బన్నీకి సపోర్ట్‌గా కాషాయ పార్టీ.. ఏదో మతలబు ఉందని అనుమానం..!
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెట్టారు.