ఒకప్పుడు పెళ్లి అంటే ఎంతో పవిత్రంగా చేసుకొనేవారు.. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి తర్వాత చెయ్యాల్సిన పనులన్నీ కూడా పెళ్లికి ముందే చేస్తూ ఇష్టం ఉంటే పెళ్లి.. లేకుంటే ఎవరిదారి వారిది.. ఇక ఈ మధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిళ్లు చాలా వింతగా జరుగుతున్నాయి.. కొన్ని పెళ్లి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అందులో ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
నిత్యం సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు షేర్ అవుతున్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో భిన్నమైనవిగా ఉంటాయి. కొన్నిసార్లు పెళ్లయిన జంటలు అందంగా డ్యాన్స్ చేయడం, కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడుకోవడం, కొన్నిసార్లు ముద్దులు పెట్టుకోవటం మనం చూశాము. అయితే ఇప్పుడు వధూవరుల వింత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. వెడ్డింగ్ డ్యాన్స్ చూడటానికి ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసినా లేదా అలవోకగా చేసినా.. ఆ డ్యాన్స్ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది..
తాజాగా షేర్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. వేదికపైకి రాగానే రొమాంటిక్ పాటలకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. చాలా మంది ఈ వీడియోను అభినందిస్తున్నారు. చాలా మంది వీరి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. పెళ్లికి ముందే ఇంత కక్కుర్తి పనులు అవసరమా అంటూ నెటిజన్లు కూడా రకరకాల కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..వరుడి కోసం వధువు చేసిన రొమాంటిక్ డ్యాన్స్ అందరికీ ఎంతగానో నచ్చింది. వరుడు ప్రతి డ్యాన్స్ స్టెప్పును చాలా అద్భుతంగా ప్రదర్శించాడు. ఈ డ్యాన్స్‌షో కోసం వధూవరులు ఫుల్ ప్రాక్టీస్‌తో వచ్చినట్టుగా తెలుస్తోంది… కొందరికి ఈ డ్యాన్స్ నచ్చితే మరికొందరు మాత్రం ఈ డ్యాన్స్ పై కామెంట్స్ చేస్తున్నారు..