NTV Telugu Site icon

OG: సరికొత్తగా దీపావళి విషెస్ చెప్పిన ‘ఓజి’ టీం..

Whatsapp Image 2023 11 12 At 2.56.04 Pm

Whatsapp Image 2023 11 12 At 2.56.04 Pm

టాలీవుడ్‌ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా బ్రో సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..పవన్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ ఓజీ. రన్ రాజా రన్‌, సాహో చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజిత్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు.నేడు దీపావళి పండుగ సందర్భంగా ఓజీ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు… ఇక ఈ పోస్టర్‌తో పాటు మేకర్స్ జపనీస్ భాషలో (ディーパバリ・シュバカカンシャル ) దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు..ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది.

“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా” అంటూ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో కనిపించి మెప్పించాడు..ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.. అలాగే ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వున్నారు… ఓజీ సినిమాలో లో ని కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే మరియు హైదరాబాద్‌ వంటి నగరాలలో తెరకెక్కించారు.. ఓజీ సినిమా లో పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ ఉండబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు..

https://twitter.com/manchididengey/status/1723582775939248549?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1723582775939248549%7Ctwgr%5E282f8228d01afc2be8fb4d1b2c2382de428251a8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F