NTV Telugu Site icon

Tarakaratna Wife : తారకరత్నను మర్చిపోలేకపోతున్న అలేఖ్యరెడ్డి.. ఎమోషనల్ పోస్ట్

Tarakaratna Family

Tarakaratna Family

Tarakaratna Wife : టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు. ఆమె తన భర్తను మర్చిపోలేకపోతున్నారు. దానికి ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న జీవించి ఉన్నప్పుడు ఇంట్లో షూట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నిన్ను నేను మరచిపోలేకపోతున్నానని అలేఖ్య రెడ్డి ఆ వీడియోకి కామెంట్ పెట్టారు. . అలేఖ్య రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఆ మధ్య ఆమె ఓ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. తనను ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న ఎన్ని అవమానాలు అనుభవించారో, ఎంత మానసిక క్షోభ పడ్డాడో చెప్పారు.

Read Also: Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం

తన సందేశంలో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలు ప్రస్తావించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఎదురైన కష్టాలు వివరించారు. అయిన వాళ్ళే పలు మార్లు బాధపెట్టారని అసహనం వ్యక్తం చేశారు. మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 27న కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 28న మరణించాడు.