Site icon NTV Telugu

Last Day: నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు

Nominesion

Nominesion

నేడు తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు చివరి రోజు. దీంతో ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్‌ బరిలో నిలిచేదెవరో ఇవాళ ఖరారు కానుంది. ఇక, నామపత్రాల పరిశీలన అనంతరం 2898 మంది అభ్యర్థులు మిగిలినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మిగిలిన అభ్యర్థలకు రిటర్నింగ్‌ అధికారులు గుర్తులు కేటాయించననున్నారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో జాబితా తయారు చేయనున్నారు. వాటి ఆధారంగా బ్యాలెట్‌ రూపొందించి ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Read Also: King Khans: ఈ ఖాన్స్ లేకుండా బాలీవుడ్ లేదు…

అయితే, మొత్తం నామినేషన్లు 3,504 వచ్చాయి. 2,898 నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌లో 114 నామినేషన్లు నమోదు అయ్యాయి. మేడ్చల్‌లో 67 మంది, కామారెడ్డిలో 58 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కొడంగల్‌లో 15 మంది బరిలో నిలిచారు. ఇక, నారాయణపేటలో అతి తక్కువగా ఏడుగురు అభ్యర్థులు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల పోటీ చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన, స్క్రూటీనిలో ఆర్వోలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని సీఈఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 119 నియోజకవర్గాల్లో రెబెల్స్ ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి.

Exit mobile version