Godavari Flood: గోదావరిలో వరద పోటెత్తడడంతో లంక గ్రామాల్లో కష్టాలు మొదలయ్యాయి.. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతుంది. కొద్దీ గంటలుగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.3 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహం కొనసాగుతోంది.. బ్యారేజీ నుండి 13 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రవాహం రెండో ప్రమాద హెచ్చరికను మించి కొనసాగుతుంది. వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ సిబ్బంది విధుల్లోకి చేరారు. ఇక, కోనసీమలో పొంగిపొర్లుతున్నాయి గోదావరి నదులు.. కోనసీమలోని వైనయతే, వశిష్ఠ, గౌతమి, వృద్ధగౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి.. వరద ఉధృతికి కాజ్ వేలు నీటమునిగిపోవడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి..
Read Also: Dhanush: మిస్టర్ ధనుష్… కీప్ ఎంటర్టైనింగ్ అస్…
ఇక, వరదలో పలు లంక గ్రామాలు చిక్కుకున్నాయి.. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక, అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం కాజ్ వే లు పూర్తిగా నీట మునగడంతో పడవలపై ప్రయాణం చేస్తున్నారు స్థానికులు.. అయితే, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. పి గన్నవరం మండలంలో వరద ఉధృతికి కాజ్‌వేలు నీట మునిగాయి.. జి పెదపూడి లంక బూరుగులంక అరికెలవారి పాలెం దగ్గర ప్రమాదమైన కాజ్‌వేలను దాటుతున్నారు ప్రజలు.. పి గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది.. వరద ప్రవాహానికి కాజ్‌వేలు నీటమునగడంతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.. ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు జి పెదపూడి లంక, బూరుగులంక, అరికెల వారి పాలెం గ్రామస్తులు ప్రయాణాలు సాగిస్తున్నారు.. ప్రమాదకరమైన కాజ్‌వేలను విద్యార్థులు దాటాల్సిన పరిస్థితి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే లంక గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు.. అయితే, వ్యవసాయ పనులు నిమిత్తం రాకపోకలు తప్పడం లేదంటున్నారు స్థానికులు.