చిన్న చిన్నవాటికి క్షణికావేశం పెద్ద సమస్యలను తీసుకువస్తున్నాయి. ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లంగర హౌజ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడనే కారణంతో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు మరో యువకుడు. ఈ ఘటన సంచలనం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ కు చెందిన ఓ యువతి లంగర్ హౌజ్ లో ఉండే రోహన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అయితే యువతి ఇంటి సమీపంలో ఉండే చింటూ అనే యువకుడు ఫేస్ బుక్ లో ఆ అమ్మాయికి హాజ్ అని మెసేజ్ పెట్టాడు. సదరు యువతి ఈ విషయాన్ని తన లవర్ రోహన్ తో చెప్పింది. కాగా.. మంగళవారం సాయంత్రం చింటూను లంగర్ హౌజ్ లోని కొత్త బ్రిడ్జ్ వద్దకు తీసుకురావాలని రోహన్, తన గర్ల్ ఫ్రెండ్ తో ప్లాన్ వేశాడు.
అప్పటికే ఆగ్రహంతో ఉన్న రోహన్ చింటూను చూడగానే కత్తితో దాడి చేశాడు. ఇందుకు రోహన్ స్నేహితుడు కూడా సహకరించాడు. రోహన్ చింటూ పై 8 కత్తిపోట్లు పొడిచాడు. యువకుడిపై దాడి చేసిన తర్వాత రోహన్ సెల్ఫీలు దిగాడు. ఈ సెల్ఫీ వీడియోలను రోహన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.