Lambasingi Movie Streaming on Hotstar: భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి జంటగా నటించిన సినిమా ‘లంబసింగి’. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.ఆనంద్ నిర్మించారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
లంబసింగి సినిమా మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈమేరకు హాట్‌స్టార్ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. లంబసింగి విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. థియేటర్లో చూడని వారు ఎంచక్కా.. లంబసింగిని ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Vijay Deverakonda: ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నా.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ చిత్రాన్ని లంబసింగి ఏజెన్సీ ప్రాంతంలో 50 రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. సినిమాలో ప్రతి పాత్ర వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. పోలీసు, నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే లంబసింగి సినిమా. హరిత అనే పాత్రలో దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. మరోవైపు ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం అయిన భరత్ రాజ్ కూడా మెప్పించాడు.