Site icon NTV Telugu

Lalitha Jewellery: 45వ లలితా జ్యువెల్లరీ షోరూం.. గాజువాకలో ఘనంగా ప్రారంభం

Lalitha Jewellery

Lalitha Jewellery

Lalitha Jewellery: 38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి ఇప్పుడు తన 45వ షోరూం విశాఖపట్నం సమీపంలోని గాజువాకలో ప్రారంభమైంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధమైంది. తద్వారా ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చని లలితా జ్యువెల్లరి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఎం.కిరణ్ కుమార్ వెల్లడించారు. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను కూడా అందిస్తోందన్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణను పొందింది లలితా జ్యువెల్లరి. ఇప్పుడు గాజువాక, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమైంది. ఇవాళ అక్కడ కొత్తగా ఓ షోరూంను ప్రారంభించారు. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో, వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంలను ఆరంభిస్తుండటం మరింత విశేషం.

Balakrishna: అక్కినేని తొక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉందంటూ..

వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం, గోపాలపట్నం, విజయనగరం, అనంతపురం, ఒంగోలు, నరసారావుపేట, నిజామాబాద్, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సోమాజిగూడ, దిల్‌సుఖ్‌నగర్, చందానగర్ షోరూంలకు ప్రజల నుంచి దక్కిన విశేష ఆదరణను చూసి.. దక్షిణభారతదేశం వ్యాప్తంగా మా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నామని ఛైర్మన్ వెల్లడించారు. గాజువాక, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు ఇతర షోరూంలకు వచ్చి నగలు కొన్నారని.. అందువల్లే తాము ఇక్కడ కొత్త షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని కిరణ్‌కుమార్‌ చెబుతున్నారు.

Exit mobile version