Site icon NTV Telugu

Hyderabad: వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని బలి..

Hyd

Hyd

Hyderabad: లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని బలైంది.. వాలిబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థినిపై కోచ్ వేధింపులకు గురి చేశాడు.. తనను ప్రేమించాలని మౌలిక అనే విద్యార్థిని కోచ్ అంబాజీ వేధించాడు. మనస్తాపానికి గురైన మౌనిక ఉరేసుకుంది. ప్రమోద్ కుమార్ హరితలకు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మయిలు ఒక అబ్బాయి. ప్రమోద్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కాగా.. మదర్ హౌస్ వైఫ్. మృతురాలు మౌలిక రెండో సంతానం. తన చెల్లి ఆత్మహత్యపై అన్న చంద్ర వర్ధన్ స్పందించాడు. “కాలేజీలో కోచ్ పై మాకు అనుమానం ఉంది. మా సిస్టర్ ఫ్రెండ్స్ నాతో చెప్పారు కోచ్ వేధించాడు. కాలేజీ నుంచి తీస్కొని వచ్చి బయటకు వెళ్లే సరికి రెండు డోర్లు మూసుకొని ఫ్యాన్ కి ఉరివేస్కుంది. చుట్ట పక్కన ఉన్న కాలనీ వాళ్ళని పిలిచాను. తర్వాత లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. నోట్ మదర్ అండ్ అన్న బైట్ ఉన్నాయ్.” అని పేర్కొన్నాడు.

READ MORE: SS Rajamouli: నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

“మౌలిక కాలేజీ మొత్తంలోనే చదువులో టాప్ స్టూడెంట్. క్లాసికల్ డాన్సర్, బెస్ట్ స్విమ్మర్ ఎలాంటి బైక్ అయినా చాలా ఈజీగా నడపగల ధైర్యవంతురాలు. అలాంటి అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేది తెలియడం లేదు. అప్పటివరకు మా తోటే మాట్లాడి అరగంటలో బయటికి వెళ్లి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంది ఈ అరగంటలో ఏం జరిగిందో మాకు తెలియాలి మౌలిక ఫోన్ మొత్తం చెక్ చేసాము ఎక్కడా మాకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ మౌలిక స్నేహితురాళ్ళు మాత్రం వాలీబాల్ కోచ్ ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడని చెప్పారు. ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్నట్లుగా వాళ్ళు చెప్పారు. కనీసం మా అమ్మాయి కానీ ఆమె స్నేహితురాలు కానీ మాకు చెప్పి ఉంటే మా కూతురును దక్కించుకునేవాళ్లం. ఇలాంటి ఘటన మరో కుటుంబంలో జరగకుండా చూడాలి. స్నేహితులు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయండి. వాళ్లని కాపాడుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు పేరెంట్స్. నా కూతురు ఆత్మహత్యకు కారణం ఏంటో మాకు తెలియాలి. ఒకవేళ ప్రేమ వేధింపులే కారణమైతే వాలిబాల్ కోచ్ ను కఠినంగా శిక్షించాలి.” అని మౌలిక తల్లిదండ్రులు, సోదరుడు తెలిపారు.

Exit mobile version