Site icon NTV Telugu

Lal Salaam : ఓటీటీలోకి వచ్చేస్తున్న లాల్ సలామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 02 19 At 3.49.24 Pm

Whatsapp Image 2024 02 19 At 3.49.24 Pm

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్నంత ఆదరణ లభించలేదు. దీంతో ఇప్పుడు తొందరగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోందనే వార్త తెగ వైరల్ అవుతుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘లాల్ సలామ్’ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించారు.. ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. విక్రాంత్ మరియు టాలీవుడ్ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

‘లాల్ సలాం’ సినిమాలో రజనీకాంత్ తో పాటుగా క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకుర్చారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు. అయితే గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా వసూళ్లు కూడా పెద్దగా రాబట్టలేదు. ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు.చాలా థియేటర్లో జనాలు లేక నిర్వాహకులు షో లు క్యాన్సిల్ చేశారు.తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు చాలా తక్కువ వచ్చాయి. రజనీకాంత్ సినిమాలకి తమిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు.దీనితో ఈ సినిమాపై తెలుగులో అంతగా బజ్ ఏర్పడలేదు. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు

Exit mobile version