టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి. నటన, హోస్టింగ్ మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోనూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, తాజాగా ఆమె మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌కు ముగింపు పలికినట్లు ఆమె కుండబద్దలు కొట్టారు.
Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో!
మంచు లక్ష్మి నటిగా ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించినప్పటికీ, నిర్మాతగా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను పంచుకుంటూ.. ‘నిర్మాతగా నా జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయింది. ఐదేళ్ల క్రితం నేను నిర్మించిన ఒక సినిమా మిగిల్చిన నష్టాలు ఇప్పటి వరకు నన్ను కోలుకోకుండా చేశాయి. ఆ సినిమా వల్ల వచ్చిన అప్పులను నేను ఇప్పటికీ కట్టుకుంటూనే ఉన్నాను. అందుకే ఇకపై నేను కేవలం నటనపైనే పూర్తి దృష్టి పెట్టలనుకుంటున్న. అంతే కానీ మళ్ళీ సినిమాలు నిర్మించే సాహసం మాత్రం చేయను. అందుకే ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు స్క్రిప్ట్ పట్టుకొని వస్తే, ముందుగా “నిర్మాత ఎవరు?” అని అడుగుతున్నా, నిర్మాత ఉన్నప్పుడే నాతో మాట్లాడమని చెప్తున్నా’అని ఆమె తెలిపారు. అంటే ఒక సినిమా ఫెయిల్యూర్ ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని ఎలా దెబ్బతీస్తుందో మంచు లక్ష్మి మాటలో స్పష్టంగా తెలుస్తోంది . ప్రస్తుతం ఆమె ఇతర భాషా చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
