Site icon NTV Telugu

Lakhpati Didi Yojana: అద్భుతమైన ప్రభుత్వ పథకం.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం..!

Lakhpati Didi Yojana

Lakhpati Didi Yojana

దేశంలోని మహిళలను శక్తివంతం చేయడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ఎక్కువ దృష్టి సారించింది. ఈ దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో మహిళల కోసం లఖ్పతి దీదీ యోజనను ప్రారంభించింది. లఖ్పతి దీదీ యోజన అనేది నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం. దీని ద్వారా దేశంలోని సోదరీమణులందరికీ నైపుణ్య శిక్షణ ఇవ్వబడుతుంది. తద్వారా వారు స్వయంగా డబ్బు సంపాదించగలరు. ఈ పథకం కింద 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తుంది

READ MORE: Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్‌..? డబుల్‌ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..

ఆధార్​ కార్డు, బ్యాంక్​ పాస్​బుక్​, SHG సభ్యత్వ కార్డు, కులధ్రువీకరణ పత్రం, ఫోన్​ నెంబర్​, పాస్​ఫొటో వంటి పత్రాలు అవసరం. మీరు ఈ స్కీమ్‌ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లఖ్‌పతి దీదీ పథకం ఫారమ్​ తీసుకుని.. అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్​ చేయాలి. మీ దరఖాస్తు ఫారమ్​ను అధికారులు పరిశీలించి.. అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.

READ MORE: Delhi: ఢిల్లీ సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్.. తప్ప తాగి పెళ్లాంతో గొడవ పడి…

ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ శిక్షణ, పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌, ఆన్‌లైన్ వ్యాపారం, బిజినెస్‌కు సంబంధించిన శిక్షణను అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తారు. తరువాత రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ స్కీమ్‌ ద్వారా మహిళలు ఆదాయ వనరుల్ని కల్పించుకునేందుకు, పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది.

Exit mobile version