Site icon NTV Telugu

Monkey: కోతులను తరిమేందుకు ఎలుగుబంట్లుగా మారుతున్న రైతులు

Monkey

Monkey

Monkey: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులు భిన్నమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువులతో ప్రజలు ఆగమాగమవుతున్నారు. లఖింపూర్ రైతులు మాత్రం కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కోతులు చెరుకు రైతులను తీవ్ర అవస్థల పాలు చేస్తున్నాయి. చెరకు పంటను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు స్థానిక రైతులు మరో మార్గాన్ని కనుగొన్నారు. ఇక్కడి రైతులే స్వయంగా ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేశారు. కోతులతో తట్టుకోలేకపోతున్నామని.. ఇది తప్ప మరో మార్గం గురించి ఆలోచించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.

Read Also:500 Note: రూ.500 నోటు గురించి బిగ్ న్యూస్.. అసలు విషయాన్ని బయటపెట్టిన PIB..!

ఇది లఖింపూర్ ఖేరీలోని జహాన్ నగర్ గ్రామానికి సంబంధించినది. ఈ గ్రామంలోని రైతులు కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేసి పొలాల్లో కూర్చున్నారు. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయని, అయితే ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పంటలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా రైతులే రకరకాల మాయలతో కోతులను తరిమికొడుతున్నారు. అంతే కాకుండా కొంత మంది రైతులు పొలాల్లో ఎలుగు బంటి డ్రస్ వేసుకుని కాపలా గా ఉంటే రూ.250 కూలీ చెల్లిస్తున్నారు.

Read Also:Gold Seize: బీఎండబ్ల్యూ కారులో మ్యాట్ కింద 12 కేజీల బంగారం.. విలువ రూ.7కోట్లు

స్థానిక రైతు గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 40 నుంచి 45 కోతులు సంచరిస్తున్నాయి. ఈ కోతుల వల్ల చెరకు పంటలకు చాలా నష్టం వాటిల్లుతోంది. మేము కూడా పరిపాలనకు విజ్ఞప్తి చేసినప్పటికీ వినలేదు. ఇప్పుడు మేము మా పంటలను కాపాడుకోవడానికి విరాళాలు అందించి 4000 రూపాయలకు ఈ దుస్తులను కొనుగోలు చేసాం. ఇలా కోతుల మధ్య వేషం వేసుకుని కూర్చోవడం ప్రమాదకరం.. కానీ రైతులు నిస్సహాయంగా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా చెరకు సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చేస్తుండగా, కోతుల బెడదతో రైతుల పంటలు భారీగా నష్టపోతున్నాయి.

Exit mobile version