Site icon NTV Telugu

Laggam: ఇల్లు ఈఎంఐలో కొందాం.. ముందు పెళ్లి చేద్దాం

Whatsapp Image 2024 05 04 At 2.23.52 Pm

Whatsapp Image 2024 05 04 At 2.23.52 Pm

పూర్వం మన పెద్దలు “ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అని అన్నారు .కానీ దర్శకుడు రమేష్ చెప్పాల మాత్రం “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చులే కానీ ముందు పెళ్ళి చేద్దాంరండి” అని అంటున్నారు.ఈ దర్శకుడు “లగ్గం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి రోనాక్ ,గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.సుభిసి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరిలో “లగ్గం”సినిమాను మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడంతో తాజాగా “లగ్గం” సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వేణు గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ “మన తెలుగు సంప్రదాయంలో జరిగే పెళ్ళిలలో ఉండే మాట ,మర్యాద , ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో లేదా వారి బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుందని”అన్నారు.

అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ “లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది ఒక అందమైన ప్రేమ కథ చిత్రమని” ఆయన అన్నారు.ఈ చిత్రంలో ఎల్.బి. శ్రీరామ్,రోహిణి, రఘు బాబు గార్ల నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.ఈ సినిమాను అన్ని వర్గాల వారిని అలరించేలా దర్శకుడు రమేష్ చెప్పాల తెరకెక్కించారు.చరణ్ అర్జున్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.బేబీ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి లగ్గం సినిమాకు సినిమాటోగ్రఫి అందించారు.అలాగే బొంతల నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది .

Exit mobile version