NTV Telugu Site icon

Lady Don : లేడీ డాన్‌ అంగూర్‌ బాయి అరెస్ట్‌

Angur Bhai

Angur Bhai

Lady Don : మోస్ట్ వాండెడ్ గంజాయి డాన్ అంగూర్ బాయి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆపరేషన్ ధూల్‌పేట్‌ కింద కార్వాన్‌లో ఎక్సైజ్ పోలీసు బృందం అంగూర్ బాయ్‌ను అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పేరున్న అంగూర్ బాయి పది కేసులలో నిందితురాలిగా ఉన్నట్లు చెప్పారు. కొంతకాలం ఆమె పోలీసుల చేతిలో చిక్కకుండా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అంగూర్ బాయిపై గంజాయి అమ్మకాలకు సంబంధించి 3 కేసులు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో, 4 కేసులు మంగల్‌హట్ పోలీస్ స్టేషన్లో, మరికొన్ని కేసులు ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో నమోదయ్యాయి. గతంలో కొన్ని కేసులలో ఆమె జైలుకు కూడా వెళ్ళింది. అంగూర్ బాయి కుటుంబం పై కూడా పది నుంచి 15 కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో అంగూర్ బాయిను ధూల్‌పేట్‌లో గంజాయి హూల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అనుమానితురాలిగా గుర్తించిన పోలీసులు, ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు గురువారం కార్వాన్ ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Allu Arjun : పొరపాటున సుకుమార్ అసలు పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్..సోషల్ మీడియాలో తీవ్ర చర్చ