NTV Telugu Site icon

Shortage of beers: రాష్ట్రంలో బీర్ల కొరత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మద్యం ప్రియులు

Beers 10

Beers 10

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగకు బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. ఇంట్లో ఎన్ని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉన్న ఈ వేడికి తట్టుకోలేని పరిస్థితి. ఈ వేడిమికి జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో సేద తీరేందుకు మద్యం ప్రియులు బీర్ల కోసం వైన్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. నో బీర్లు అనే బోర్డు దర్శనమివ్వడంతో నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఏర్పడింది. కొద్ది రోజుల కిందట కేఎఫ్ లైట్ బీర్లు మాత్రమే దొరకడం లేదని.. మందుబాబులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. తాజాగా హార్డు, లైట్ బీర్లతో పాటు టిన్ లు కూడా దొరకడం లేదని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Congress : రాయ్‌బరేలీ, అమేథీపై కాంగ్రెస్ కీలక నిర్ణయం, పరిశీలకులుగా ఇద్దరు మాజీ సీఎంలు

ఎండల వేడికి తట్టుకోలేక పోతున్నామని మద్యం ప్రియులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బీర్ల కొరతలను అరికట్టాలని కోరుతున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే.. ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఆబ్కారీ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1-18 వతేదీ వరకు జరిగిన అమ్మకాల విలువను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ 18 రోజుల్లో రూ.670 కోట్ల విలువైన బీర్లు తాగేశారని వెల్లడించింది.