Site icon NTV Telugu

Mine Collapses : ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన గని.. ఏడుగురు మృతి

Mines

Mines

Mine Collapses : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సున్నపురాయి గని కొంత భాగం కూలిపోవడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రమైన జగదల్‌పూర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్గావ్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని ఇక్కడ పోలీసు అధికారి తెలిపారు. 15 మందికి పైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్తర్ జిల్లాలోని మాలేగావ్‌ పంచాయతీలో గల చుయ్ గనిలో ఇవాళ తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ‘బాధితులు గనిలో మట్టిని తవ్వుతుండగా, దానిలో కొంత భాగం పడిపోవడంతో వారు శిథిలాల కింద చిక్కుకున్నారు” అని అతను చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏడుగురు వ్యక్తులు మాత్రమే మట్టిని తవ్వుతున్నట్లు తెలుస్తోంది. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version