Site icon NTV Telugu

ఈటలకు ఓట్లు అడిగే అర్హతే లేదు : ఎల్ రమణ

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు పద్మశాలి ఓట్లు అడిగే అర్హత కోల్పోయాడని ఎల్‌ రమణ ఫైర్‌ అయ్యారు. హుజూరాబాద్ పట్టణంలో ని టిఆర్ఎస్ కార్యాలయంలో ఎల్ రమణ మాట్లాడుతూ… కేంద్రం లో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత పరిశ్రమ నిధులు తగ్గించారని.. దేశంలో హ్యాండ్‌లూమ్‌ బోర్డును బిజెపి రద్దు చేసిందని నిప్పులు చెరిగారు. చేనేత పరిశ్రమ బీమా లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్ర పరిశ్రమ ముందు దోషిగా నిలబడిందని… చేనేత వస్త్రాలపై, నూలు పై జీఏస్టి విధించిందన్నారు. చేనేత కార్మికులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు. బతుకమ్మ చీరలతో చేనేత పరిశ్రమను ఆదుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు.

Exit mobile version