KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
- 2026-27 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
- బాలవాటిక, 1వ తరగతి అడ్మిషన్లకు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- 2వ నుంచి 9వ తరగతి వరకు ఏప్రిల్ 2–8 మధ్య ఆఫ్లైన్ అప్లికేషన్లు
- బాలవాటిక మొదటి మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 8న, 1వ తరగతి లిస్ట్ ఏప్రిల్ 9న విడుదల
- అవసరమైతే ఏప్రిల్ 16, 21 తేదీల్లో 2వ, 3వ జాబితాలు
- మొత్తం అడ్మిషన్ ప్రక్రియ జూలై 31, 2026 వరకు కొనసాగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KVS Admissions 2026-27: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVs) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలలు నాణ్యమైన విద్య, సీబీఎస్ఈ సిలబస్, క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందినవి. దీంతో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సీట్ల కోసం భారీ పోటీ ఉండనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బాలవాటిక నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఒకటో తరగతి (Class 1), బాలవాటిక అడ్మిషన్లకు మార్చి 20 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వీటిని ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, బాలవాటిక-2 ప్రవేశాలకు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు.
Vehicle Tax Cancelled: వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 2 శాతం ట్యాక్స్ రద్దు..
Also Read
మెరిట్ జాబితాల విడుదలకు కూడా తేదీలు ఖరారు చేశారు. బాలవాటిక మొదటి జాబితా ఏప్రిల్ 8న, ఒకటో తరగతి మొదటి జాబితా ఏప్రిల్ 9న విడుదల కానుంది. అవసరాన్ని బట్టి ఏప్రిల్ 16, 21 తేదీల్లో రెండో, మూడో జాబితాలు ప్రకటిస్తారు. మొత్తం అడ్మిషన్ ప్రక్రియ జూలై 31, 2026తో ముగుస్తుంది. విద్యార్థుల వయోపరిమితి కూడా స్పష్టంగా నిర్దేశించారు. మార్చి 31, 2026 నాటికి బాలవాటిక-1కి 3 నుంచి 4 సంవత్సరాల మధ్య, బాలవాటిక-2కి 4 నుంచి 5 సంవత్సరాల మధ్య, బాలవాటిక-3కి 5 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఒకటో తరగతికి కనీసం 6 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. ఏప్రిల్ 1న జన్మించిన పిల్లలను కూడా అర్హులుగా పరిగణిస్తారు. దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
రిజర్వేషన్ విధానం ప్రకారం ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5 %, ఓబీసీ (NCL)కు 27%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు అవకాశం ఉంటుంది. ఒకటో తరగతి, బాలవాటిక అడ్మిషన్లకు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేయాలి. పై తరగతులకు సంబంధించి ఆయా కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీల ఆధారంగా నేరుగా స్కూల్కు వెళ్లి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. 11వ తరగతి అడ్మిషన్లు పదో తరగతి ఫలితాల తర్వాత ప్రారంభమవుతాయి.
దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ, కుల ధృవీకరణ (వర్తించే వారికి), ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు వంటివి అవసరం. తల్లిదండ్రులు దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కఠినంగా ఉంటుందని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు https://admission.kvs.gov.in/ ను వీక్షించండి.
తాజావార్తలు
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!