Weight Loss Injections Prices Fall: ఇక చాలా తక్కువ ఖర్చుతో బరువు తగ్గొచ్చు.. 70 శాతం చౌకగా బరువు తగ్గించే ఇంజెక్షన్లు.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Injections Prices Fall: భారతదేశంలో ఊబకాయం, మధుమేహం చికిత్స మరింత అందుబాటులోకి రానుంది. బరువు తగ్గించడానికి ఉపయోగించే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల ధరలు భారీగా తగ్గే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఔషధాల ధరలు సుమారు 70 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. మార్చి 20తో సెమాగ్లుటైడ్ ఔషధానికి సంబంధించిన పేటెంట్ గడువు ముగియనుంది. దీంతో ఇప్పటి వరకు కొన్ని విదేశీ కంపెనీల ఆధీనంలో ఉన్న ఈ ఔషధాన్ని, ఇకపై భారతీయ ఔషధ సంస్థలు జెనరిక్ రూపంలో తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. దీనివల్ల పోటీ పెరిగి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ల నెలవారీ ఖర్చు సుమారు రూ.9,000 నుండి రూ.28,000 వరకు ఉంది. అయితే పేటెంట్ గడువు ముగిసిన తర్వాత ఈ ఖర్చు రూ.3,000 నుండి రూ.4,000 మధ్యకు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జెనరిక్ మందులు తక్కువ ఖర్చుతో తయారవడం వల్ల ధరలు తగ్గడం సహజం. సెమాగ్లుటైడ్ ప్రపంచవ్యాప్తంగా ఓజెంపిక్, వెగోవి వంటి బ్రాండ్ పేర్లతో ప్రసిద్ధి పొందింది. ఇప్పటివరకు పేటెంట్ కారణంగా ఈ మందులపై పరిమిత కంపెనీలకే అధికారం ఉండేది. అయితే ఇప్పుడు సుమారు 50కి పైగా భారతీయ ఔషధ సంస్థలు తమ జెనరిక్ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ పోటీ కారణంగా కేవలం ధరలే కాదు, డోసేజీ, ఇంజెక్షన్ పరికరాలు, సేవా విధానాల్లో కూడా మెరుగుదలలు రావచ్చు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
నిపుణుల వార్నింగ్
అయితే, నిపుణులు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్లను సోషల్ మీడియాలో ట్రెండ్‌గా లేదా త్వరగా బరువు తగ్గే మార్గంగా భావించడం ప్రమాదకరం. సెమాగ్లుటైడ్ ఒక శక్తివంతమైన ఔషధం. ఇది శరీరంలోని హార్మోన్లు, రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఈ మందులను కేవలం క్లినికల్‌గా ఊబకాయం లేదా తీవ్రమైన మధుమేహం ఉన్నవారు మాత్రమే, వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించాలి. స్వయంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వైద్య నిపుణుల ప్రకారం, ఈ ఔషధం వాడకానికి ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఎండోక్రినాలజిస్ట్ లేదా వైద్యుల సలహా తప్పనిసరి. మొత్తానికి, సెమాగ్లుటైడ్ ధరలు తగ్గడం వల్ల చికిత్స అందుబాటులోకి వస్తున్నప్పటికీ, దీన్ని సరైన విధంగా, వైద్యుల సూచనలతో మాత్రమే ఉపయోగించడం అత్యంత అవసరం.
తాజావార్తలు
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!