NTV Telugu Site icon

Kushi : ట్రైలర్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..

Whatsapp Image 2023 08 07 At 3.16.30 Pm

Whatsapp Image 2023 08 07 At 3.16.30 Pm

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా కోసం ఫ్యాన్స్ మూవీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీత గోవింద తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’సినిమా భారీ అంచనాల తో విడుదల అయి . డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ తో విజయ్ దేవరకొండ కాస్త నిరాశ చెందారు.దీనితో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టేందుకు ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది..  శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది..సెప్టెంబర్ 1 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సినిమా విడుదల కు సమయం దగ్గర పడుతూ ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. దీనితో వరుసగా అప్డేట్స్ కూడా ఇస్తూ వస్తుంది.ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. విజయ్ దేవరకొండ సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిని పెంచుతుంది.ఈ క్రమం లో చిత్ర ట్రైలర్ పై తాజాగా చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు..ఆగస్టు 9 న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉంటుందని తెలిపారు. ఈ సందర్బం గా  ఓ రొమాంటిక్ పిక్ ను కూడా అభిమానులతో పంచుకున్నారు. విజయ్ దేవరకొండ ఒడి లో సమంత కూర్చున్న ఫొటోను షేర్ చేసి ట్రైలర్ పై ఎంతో ఆసక్తి పెంచేశారు.

Show comments