Kushi : ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఐదు రోజుల్లో దాదాపు 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొంది.పాన్ ఇండియన్ లెవెల్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు వున్న ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 90 కోట్లకు ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను అక్టోబర్ 6 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం కన్నడ భాషల్లో కూడా డిజిటల్ రిలీజ్ కానున్నట్లు సమాచారం..
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే నాస్తిక కుటుంబంలో పుట్టిన అబ్బాయి, ఆచారాలు, సంస్కృతులకు ప్రాముఖ్యతనిచ్చే ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? కుటుంబ సిద్ధాంతాలు, నమ్మకాలు వారి ప్రేమకు ఏ విధంగా అడ్డంకిగా మారాయనే పాయింట్‌తో సింపుల్ ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శకుడు శివనిర్వాణ ఖుషి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది. ఈ సినిమాలో వెన్నెలకిషోర్, శరణ్య, మురళీశర్మ, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. రీసెంట్ గా వైజాగ్ లో సక్సెస్ మీట్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు హీరోయిన్ సమంత కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..