Kushboo : స్త్రీ గొప్పతనం అనేది అంతటా ఒక అనువర్తనం, అనుభవం, మానవత్వం యొక్క ప్రతీక. స్త్రీలు తమ జీవన కాలంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ప్రతికూలతలను దాటుకొని అగ్రతలపై ఎదుగుతూ వస్తున్నారు. వారివి నిజంగా అద్భుతమైన జీవన కథలు. వీరి గొప్పతనం వివిధ రంగాలలో ప్రతిబింబిస్తుంటుంది.. అయితే.. ప్రస్తుత ప్రపంచంలో ఈదేశం.. ఆ దేశం అని ఏమీ లేదు.. ఎక్కడైనా.. ఆడవారు బయట కనిపిస్తే వంకర బుద్ధితో చూసేవారే ఎక్కువ.. ఈ లైంగిక వేధింపులు ప్రతి రంగంలో జరిగేవి. అయితే సినిమా పరిశ్రమలో స్త్రీలు ఎదుర్కొనే అవమానాలు మరింత ఎక్కువనే చెప్పాలి. కొందరు అవకాశం ఇచ్చేందుకు, మరికొందరు డబ్బు వాగ్దానాలు చేసి, కొందరు హీరోయిన్లతో కమిట్మెంట్లు అడుగుతారు. ఈ రకమైన వేధింపులు ఎన్నో కాలాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, గత తరం హీరోయిన్లు ఈ అంశాలను బయట పెట్టడానికి తడబడ్డారు.
Perni Nani: ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు.. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి కూడా..!
కానీ నేటి తరం హీరోయిన్లు ఎవరూ భయపడడం లేదు. ఎవరైనా తమతో తప్పుగా ప్రవర్తిస్తే, వారు సోషల్ మీడియా వేదికగా తమ గొప్ప పద్ధతిలో స్పందిస్తున్నారు. ఈ తరహా సంఘటనలు జరగడమే కాకుండా, గత తరం హీరోయిన్లు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. సీనియర్ నటి కుష్బూ తనతో జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.
ప్రస్తుతం గోవాలో 2024 ఇఫీ (భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా కుష్బూ లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ అంశాల గురించి మాట్లాడింది. ఆమె చెప్పినట్టుగా, క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, అన్ని రంగాల్లో జరుగుతుంది. ఆమె అనుభవం గురించి చెపుతూ, ఒక సినిమాకు షూటింగ్ లో పాల్గొనగా ఒక హీరో అనుచితంగా తనకు ఏమైనా ఛాన్స్ ఉందా అంటూ కమిట్‌మెంట్ అడిగినట్లు చెప్పింది.
అయితే కుష్బూ దీని గురించి సమాధానంగా.. తన చెప్పు సైజు 41 అని చెప్పి, చెంప ఇక్కడే పగలగొట్టనా.. లేక సెట్లో అందరి ముందు పగలగొట్టనా అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. ప్రస్తుతం కుష్బూ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు “కుష్బూ” మాదిరిగల ఫైర్ బ్రాండ్ ను కమిట్‌మెంట్ అడిగిన హీరో ఎవరన్న విషయంపై ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా, స్త్రీలు కష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Rajasthan: చితిపై తగలబడుతుండగా స్పృహ.. ఒక్కసారిగా లేచిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!