NTV Telugu Site icon

Principal Harassment: కర్నూలు రెసిడెన్షియల్ స్కూళ్ళో ప్రిన్సిపల్ వేధింపులు

Harassment

Harassment

చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, చిన్నారులు, విద్యార్ధినిలపై వేధింపులు ఆగడం లేదు. గురుదేవో భవ అంటారు.. కానీ కొంతమంది గురువులు విద్యార్ధినులను వేధిస్తూ మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా కర్నూలులో ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థిని పురుష ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. అదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నాడు. గదికి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తండ్రికి ఫిర్యాదు చేసింది ఆ బాధిత విద్యార్థిని. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Kangana Ranaut: ముందుంది ముసళ్ల పండగా.. ఆ నిర్మాతకి కంగనా వార్నింగ్

ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక తండ్రి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్కూళ్ళో టీసీ తీసుకొని మరో రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించాడు తండ్రి. అయితే ఆ అమ్మాయికి టీసీ ఇచ్చేందుకూ ఇబ్బంది పెట్టాడు ఆ కీచక ప్రిన్సిపల్. దీంతో ఏం చేయలేక టీసీ తీసుకున్నాడా తండ్రి. ఈ కీచక ప్రిన్సిపల్ పై ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ, మహిళా కమిషన్, కలెక్టర్ సహా మంత్రులకు ఫిర్యాదు చేశారు. నెలలు గడిచినా చర్యలు లేవని విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిశ చట్టం.. ఆ చట్టం ఈ చట్టం అంటూ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో వేధింపులు మాత్రం ఆగడం లేదని, ఇలా అయితే ఆడపిల్లల్ని ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎలా చదివిస్తామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అయినా ఈ ఘటనపై స్పందిస్తారో లేదో చూడాలి.

Read Also: Sachin Pilot Vs Ashok Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్ లో పోరు.. నిరాహారదీక్షకు దిగిన సచిన్ పైలట్

Show comments