Site icon NTV Telugu

Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్‌ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..!

Pawan Kalyan (1)

Pawan Kalyan (1)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో పోలీసులు రెచ్చిపోయారు. ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడిని చితకబాదారు. దుస్తులు విప్పి.. లాఠీలతో కొట్టి.. కాళ్ళతో తొక్కి హింసించారు. ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చావబాదారు. ఎలాంటి కేసులు లేకున్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

Also Read: 2019 World Cup: 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తప్పిదం చేశాం.. ఇంగ్లండ్‌ కప్ గెలిచేదే కాదు! అంపైర్ సంచలన వ్యాఖ్యలు

వివరాల ప్రకారం… కర్నూలు 8వ డివిజన్ కార్పొరేటర్ పరమేష్ (వైసీపీ), 9వ వార్డు కార్పొరేటర్ కుమారుడు నవీన్ (వైసీపీ)ను పోలీసులు చితకబాదారు. ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చితకొట్టారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి.. దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి, కాళ్ళతో తొక్కి హింసించారు. ఎలాంటి కేసులు లేకున్నా.. ఇద్దరిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. బాధితులను వేర్వేరుగా ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ పరామర్శించారు. నేడు కలెక్టర్, ఎస్పీలకు నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

Exit mobile version