Site icon NTV Telugu

Villagers Migration : పనిలేదు.. ఊళ్ళకు ఊళ్లు వలసలు..ఎక్కడంటే?

Migration 1

Migration 1

ఊళ్ళు, గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అంటారు. కానీ ఊళ్ళకు ఊళ్ళు వలసపోతున్నారు. కన్న తల్లిని, ఉన్న ఊరుని వదలకూడదంటారు. కానీ ఆజిల్లాలో మాత్రం వలసలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఊరివాసులు పిల్లాపాపలతో వలస బాట పట్టారు. కోసిగి, కౌతాలం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల్లో పల్లె ప్రజలు పట్టణాలకచ వలసలు వెళ్తున్నారు. కోసిగి మండలంలో ఒక్కరోజే దాదాపు 10 వేల మంది వరకు పసి పిల్లలతో కలిసి వలస బాట పట్టారు. కోసిగి మండలం , అర్లబండ, సజ్జలగూడం, కందుకూరు, నుంచి వలస బాట పడ్డారు. మంత్రాలయం మండలం నుంచి దాదాపు 800 మంది పెట్టేబేడా సర్దేశారు.

Read Also: Amazon: యాపిల్‌ను దాటేసిన అమెజాన్..అత్యంత విలువైన కంపెనీగా

జిల్లాలోని కౌతాలం మండలం నుంచి 200 కుటుంబాలు, పెద్దకడుబూరు మండలం నుంచి 20 కుటుంబాలు గుంటూరు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రకు వలసలు వెళ్తున్నారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపలతో వలస బాట పట్టడంతో పలు కాలనీలు జనం లేక నిర్మానుష్యంగా మారాయి. కేవలం వృద్ధులు మాత్రం ఇళ్లు దగ్గర ఉండటం విశేషం. కొంతమంది వృద్ధులు దగ్గర పసి పిల్లలను వదిలి వెళ్లారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనులు బిల్లులు రాకపోవడంతో వలసలు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: School Dispute: స్కూల్ మేనేజ్ మెంట్ Vs లీజుదారు

Exit mobile version