Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.. బైక్ ను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు చెలరేగాయి.. మంటల్లో వోల్వా బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.. పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. హైవే పై వెళ్తున్న వాహనదారులు కూడా సహాయం చేశారు. బస్ లో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. తాజాగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికుడు కీలక సమాచారం వెల్లడించారు. బస్సు డ్రైవర్ కనీసం ప్రయాణికులను అలర్ట్ చేయలేదని తెలిపారు. అలర్ట్ చేసి ఉంటే మరి కొంత మంది ప్రాణాలతో బయటపడేవాళ్లన్నారు.
READ MORE: US vs India: చైనా లాగే భారత్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంది..
“మేము గాఢ నిద్రలో ఉన్నాం.. బస్ ఒక బైక్ ను ఢీ కొట్టింది.. కొద్ది దూరం వరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది.. బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలింది.. ముందు నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి.. డ్రైవర్ మమ్మల్ని లేపలేదు.. మంటలు గమనించి లేచాం.. ఎమర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోలేదు.. అద్దాలు బ్రేక్ చేసి బయటకు దూకాం.. మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.. 10 మందికి పైనే చనిపోయి ఉంటారు.. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఊపిరి ఆడలేదు.. బస్ ను పొగ కమ్మేసింది..” అని ప్రయాణికుడు శివ పేర్కొన్నాడు..
