NTV Telugu Site icon

Kurchi Madathapetti song : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన జపాన్ జంట..

Japan Pair

Japan Pair

తెలుగు సూపర్ మహేష్ బాబు ఇటీవల నటించిన సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరాకెక్కించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది.. సినిమా వచ్చి నెల అయిన కూడా ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు.. నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు..

తెలుగోళ్లు మాత్రమే కాదు.. వేరే దేశంలోని వాళ్లు కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తు రీల్స్ చేస్తున్నారు.. గతంలో చాలా పాటలకు పారినర్స్ స్టెప్పులేసారు.. ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది. ఆ మధ్య కొందరు ఫారినర్స్ తమ జిమ్ వర్క్ అవుట్స్ కోసం ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ని ఉపయోగించుకుంటూ కసరత్తులు చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది..

ఇప్పుడు ఓ జపాన్ జంట ఈ సాంగ్ ను రీ క్రియేట్ చేస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.. జపాన్ జంట వేసిన స్టెప్పులు విజుల్స్ వేయిస్తున్నాయి. ఈ వీడియో చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. ‘జపాన్ జంట స్టెప్పులతో ఇచ్చిపడేశారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు… మొత్తానికి ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇకపోతే మహేష్ సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం..