NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నిర్మాణం పై ఫోకస్ పెట్టాం

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ రావు, వరంగల్, హనుమకొండ జిల్లా కార్యదర్శులు రవి, భిక్షపతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు మాట్లాడుతూ.. చైతన్య వంతంగా పార్టీని బలోపేతం చేయడానికి కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 25 నాటికి సీపీఐ వందేండ్లు పూర్తి చేసుకుంటుందని, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నిర్మాణం పై ఫోకస్ పెట్టామన్నారు కూనంనేని. బీఆర్ఎస్ సృష్టించిన సంక్షోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతున్నదని, రుణమాఫీ వందశాతం అమలు కాలేదని రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేకతను ముఠా కట్టుకోవద్దని కోరుకుంటున్నామని, బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. బీజేపీ ని నిలువ రించడంతో పాటు సిపిఐ బలోపేతం కోసం కృషి చేస్తామని, ప్రజల ఆకాంక్ష మేరకు పాలనా సాగని పక్షంలో ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. అనంతరం.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ.. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఓటర్లు తీర్పు ఇచ్చారని, నితీష్, చంద్రబాబు లు ఎన్ని రోజులు మద్దతు ఇస్తారో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం లోని మోదీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థ ల మేలు కొరలా ఉందని, కార్పొరేట్ కంపెనీ ల కోసమే బడ్జెట్ పెట్టిందన్నారు. పేదల కోసం ఎలాంటి అవకాశం కల్పించలేదని, దేశంలో నిరుద్యోగ శాతం పెరుగుతున్నదని, బడ్జెట్ లో విద్య, వైద్యం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు డి.రాజా. 400స్థానాలతో అధికారం లోకి వస్తామని చెప్పి 250లోపు స్థానాలకే పరిమితం అయిందని, అభివృద్ధి చెందిన దేశంగా భరత్ మారిందని చెబుతూనే… రేషన్ ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదో చెప్పాలన్నారు.

సెబీ, ఇండెన్ బర్గ్, ఆదాని కంపెనీల పై మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు… అదానీ కంపెనీల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. బెంగాల్ లో చోటు చేసుకున్న ఘటన పై మోడీ మౌనం విడాలి… దేశంలో మహిళల పై దాడులు రోజు రోజు కు దాడులు పెరుగుతున్నాయి… మహిళల పై దాడులు, అత్యాచారాలు అరికట్టేందుకు.. సుప్రీం కోర్ట్ యే కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది… మహిళ ల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు తీసుకుని రావాలి… పకడ్బందీగా అమలు చేయాలి. రిజర్వేషన్, సామజిక న్యాయం వంటి వాటిని ఎత్తి వేయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది… డాక్టర్ల పై దాడులు అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని కోరుతున్న ఎందుకు పట్టించుకోవటం లేదో స్పష్టం చేయాలి. ప్రయివేట్ సెక్టార్ లోనూ రిజర్వేషన్ అమలు చేయాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగం పై ప్రత్యక్షం గా దాడి చేస్తున్నాయ్… ఆదాని, అంబానీ లకు బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోంది.. ఒకే దేశం ఒకే ఏలెక్షన్ అనే నినాదం తో దేశం లో ఆర్ ఎస్ ఎస్ ఎజెండా ను అమలు చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. ప్రజాస్వామ్య పార్టీలతో కల్సి రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు పోతాం.దేశం ప్రజా స్వామ్య దేశం అనేది మోడీ గుర్తించాలి…ఎన్ కౌంటర్ ల తో అధికారం కాశ్మీర్‌లో శాంతి భద్రత లు రక్షించడం లో మోడీ ప్రభుత్వం విఫలమైంది… కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తా అని చెప్పింది… ఎందుకు ఆలస్యం చేస్తోంది… ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది… వాటిని అమలు చేయాలి…’ అని డి.రాజా అన్నారు.