Kunamneni Sambasiva Rao : రేపటి నుండి జరిగే ఆటో కార్మికుల సమ్మెను మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీతో తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు ఆటో యూనియన్ జెఎసి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలో ఈ రోజు హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జెఎసి వారు సాంబశివరావును కలిసి వారు పలు డిమాండ్లను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలి వారు కోరారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 10వ తేదీ లోపు ఆటో యూనియన్‌లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సాంబశివరావు తెలిపారు.
MP: క్రమశిక్షణే మారణశాసనం అయింది.. ప్రిన్సిపాల్‌ను చంపిన విద్యార్థి
ఈ చర్చలలో ప్రజాప్రతినిధులుగా కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరామ్ పాల్గొంటారని, ఆటో యూనియన్ జెఎసి నుండి ఆటో యూనియన్ సంఘాల నాయకులు పాల్గొని సామరస్యపూరిత వాతావరంలో చర్చలు జరుపుకొంటామని కూనంనేని సాంబశివరావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటో యూనియన్‌ల సమస్యలు అనేకం వున్నా వాటిలో కొన్నింటికైన పరిష్కారం లభిస్తున్నదని వారు ఆశభావం వ్యక్తం చేశారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి చర్చలు జరుపుతామని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో కార్మికులు మహాలక్ష్మి పథకాన్ని తీసివేయాలని కోరడం లేదని, కాని వారికి సంవత్సరానికి రూ. 15000 ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, వారి సంక్షేమార్థం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తదితర హామీలను పూర్తి చేయాలని సాంబశివరావు తెలిపారు.
Masood Azhar: పాక్‌లో స్వేచ్ఛగా మసూద్ అజార్.. కఠిన చర్యల కోసం భారత్ డిమాండ్..