Kumari Aunty Special Guest for Bigg Boss 7 Utsavam Event: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ‘కుమారి ఆంటీ’దే హవా. ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన కుమారి అనే మహిళ.. మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి బిజినెస్ రన్ చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన కస్టమర్స్‌ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్తూ.. రుచికరమైన భోజనం అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. అక్కడ భోజనం చేసిన వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. కుమారి ఆంటీ ఫుడ్‌కు గిరాకీ బాగా పెరిగిపోయింది. కుమారి ఆంటీ ఫుడ్ కోసం జనాలు ఎగబడుతున్నారు.
ఇటీవల ఫుడ్ స్టాల్ క్లోజ్ అవ్వడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ఓపెన్ అవ్వడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయ్యారు. ఎంతలా అంటే.. కుమారి ఆంటీ ఓ టీవీ షోకు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ అయ్యారు. ‘బిగ్‌బాస్ ఉత్సవం’ పేరుతో స్పెషల్ ఈవెంట్‌ను స్టార్ మా ప్లాన్ చేయగా.. ఈ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ బిగ్‌బాస్ ఉత్సవం షోకు కుమారి ఆంటీ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. అంతేకాదు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు కుమారి ఆంటీ తన వంటల టాలెంట్‌ను రుచి చూపించారు. కుమారి ఆంటీ నాన్ వెజ్ భోజనంకు కంటెస్టెంట్స్ అందరూ ఫిదా అయ్యారట.
బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌తో కల్సి కుమారి ఆంటీ స్టేజ్‌పై సందడి చేశారు. ఆమె వడ్డించిన భోజనం తింటూ సరదాగా గడిపారు. ఇందుకుసంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుమారి ఆంటీతో స్టార్ మా నిర్వహకులు ఓ స్పెషల్ స్కిట్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఉత్సవం షో త్వరలో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నటుడు అమర్‌దీప్ చౌదరి రన్నరప్‌గా నిలిచాడు. శివాజీ, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, సుభాశ్రీ రాయగురు, శోభా శెట్టి, అర్జున్ అంబాటి, టేస్టీ తేజా, నైనీ పావని, రతిక రోజ్, అశ్విని, భోలే షావలి తదితరులు బిగ్‌బాస్ ఉత్సవంలో సందడి చేయనున్నారు.