Site icon NTV Telugu

Kuldeep Yadav Marriage: పెళ్లికొడుకు అయిన టీమిండియా స్టార్ క్రికెటర్.. భార్య ఆస్తి ఎంతో తెలుసా?

Net Worth

Net Worth

Kuldeep Yadav Marriage: భారత క్రికెట్ జట్టు స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను ఆయన నేడు (మార్చి 14, 2026) వివాహం చేసుకోబోతున్నారు. ముస్సోరీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతోంది. కుల్దీప్, వంశికలది కాన్పూర్‌లో మొదలైన అందమైన ప్రేమకథ అని వారి సన్నిహితులు చెబుతున్నారు. పొరుగు ఇళ్లలో పెరిగిన వీరిద్దరి మధ్య ఉన్న చిన్ననాటి స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది. 2025లో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి గతేడాదే పెళ్లి జరగాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఈరోజు శుభముహూర్తం ఖరారైంది.

READ ALSO: DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్‌గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..

వంశిక చద్దా నేపథ్యం ఇదే..
లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడే వంశిక చద్దా వృత్తిరీత్యా కార్పొరేట్ ఉద్యోగి. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఎల్‌ఐసీ (LIC) సంస్థలో పని చేస్తున్నారు. ఆమె తండ్రి యోగేష్ చద్దా కూడా అదే సంస్థలో పని చేయడం విశేషం. నిరాడంబరమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వంశిక, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుల్దీప్ యాదవ్ – వంశికల ఆస్తుల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పలు నివేదికల ప్రకారం వారి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. టీమిండియా మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ (ఢిల్లీ క్యాపిటల్స్) కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కుల్దీప్ దాదాపు రూ.34 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. ఇకపోతే వంశిక చద్దా ఆస్తుల విషయానికి వస్తే.. తన కార్పొరేట్ ఉద్యోగం ద్వారా వంశిక సుమారు రూ.40 – 50 లక్షల వరకు ఆస్తిని కలిగి ఉన్నట్లు సమాచారం. ఆర్ధికంగా కుల్దీప్ చాలా ముందంజలో ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఆస్తులకు అతీతమని వారి సన్నిహితులు చెబుతుంటారు.

రాయల్ వెడ్డింగ్ కార్డ్.. లక్నోలో రిసెప్షన్
ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. ‘KV’ (కుల్దీప్-వంశిక) అనే ఇనీషియల్స్‌తో కూడిన 3D మెటాలిక్ బాక్స్ వెడ్డింగ్ కార్డ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముస్సోరీలో ప్రైవేట్ వేడుకగా వివాహం ముగిసిన తర్వాత, లక్నోలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

READ ALSO: Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!

Exit mobile version