Kuldeep Yadav Engagement: ఇండియన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో నిశ్చితార్థం జరిగింది. బుధవారం లక్నోలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. రింకూ సింగ్ ఈ వేడుకకు హాజరయ్యారు.
Read Also: Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్ వెర్నా SX+ లాంచ్..!
వంశిక లక్నోలోని శ్యామ్ నగర్‌కు చెందినవారు. ప్రస్తుతానికి LIC సంస్థలో పని చేస్తున్నారు. చిన్ననాటి నుండి కుల్దీప్‌తో వంశికకు మంచి స్నేహం ఉంది. ఈ స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారింది. వారి అనుబంధం ఇప్పుడు జీవిత ప్రయాణంగా మారింది. ఇద్దరూ వేదికపై ఉంగరాలు మార్పడంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఈ ముఖ్యమైన మలుపుతో కుల్దీప్ ఆనందంలో మునిగిపోతుండగా, ఆయన క్రికెట్ ప్రయాణం కూడా స్ఫూర్తిదాయకంగానే కొనసాగుతోంది.
Read Also: Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!
ఐపీఎల్ 2025లో డిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన కుల్దీప్ 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన ఇచ్చాడు. 2017లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత కుల్దీప్ అన్ని ఫార్మాట్లలో విశ్వసనీయంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో ఆయన ఇప్పటికే 180కి పైగా వికెట్లు తీసి భారత జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు. అతనిని ముద్దుగా ‘చైనామెన్’ అంటూ పిలుస్తారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన కుల్దీప్, ముందున్న ఇంగ్లండ్ పర్యటనపై దృష్టి పెట్టనున్నాడు. అక్కడ టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ఆయన అనుభవం, నైపుణ్యం కీలకంగా మారనుంది.
