NTV Telugu Site icon

KTR: నాంపల్లి కోర్టులో పరువునష్టం దావాపై కేటీఆర్‌ స్టేట్‌మెంట్ రికార్డ్..

Ktr

Ktr

బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకున్నానని.. చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియాకు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుందని.. 2006 ఆగస్టు కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయని.. 2006 నుంచి 2009 లో తాను తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ గా పనిచేసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశానని.. 2009 లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలో గెలిచినట్లు తెలిపారు. 5 సార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందినట్లు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు మంత్రిగా కొనసాగానన్నారు. 2018 తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎన్నికైనట్లు తెలిపారు. ప్రజా జీవితంలోనే ఉన్నానని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు, రివార్డులు సైతం కైవసం చేసుకున్నట్లు తెలిపారు.

READ MORE: Israel-Labnon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. కుప్పకూలిన భారీ నివాస భవనం

చాలా బ్యాట్మెంటన్ అసోసియేషన్, లాండ్ అసోసియేషన్ తో కలిసి పనిచేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. “దేశంలోనే ఐటీ టెక్నాలజీ మినిస్టర్ గా అనేక కంపెనీలను తెలంగాణ రాష్టానికి తీసుకు వచ్చాను.. నా పరువు ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.. గత 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న తనను తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నిరాదార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారు. తనపై సమాజంలో ఉన్న మంచి పేరు, ప్రతిష్టలను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలును కోర్టుకు సమర్పించాను.. యూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చాను..” అని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

READ MORE:Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..

కొండా సురేఖ ఏం వాఖ్యలు చేశారని.. కోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ న్యాయవాది సమాధానమిచ్చారు. దానినే ప్రామాణికంగా తీసుకోవాలా? స్టేట్మెంట్ ఇస్తారా ? అని కోర్టు అడిగింది. ఆమె మాట్లాడిన మాటల్లో చాలా అసహ్యంగా ఉన్నాయని.. వివరంగా చెప్పమంటే చెప్తామని కేటీఆర్ కోర్టుకు స్పష్టం చేశారు. కేటీఆర్ తన స్టేట్‌మెంట్‌లో ఇలా ప్రస్తావించారు. “విడాకులు అయ్యిందండి ఒకరిది.. నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ చేయబట్టే జరిగింది అని వ్యాఖ్యానించారు. చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ హాల్ ను కులగొట్టొద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని నేను డిమాండ్ చేశానని..మంత్రి వ్యాఖ్యానించారు. ఇక నేను చెప్పలేను.” అని కేటీఆర్ తెలిపారు. కొండ సురేఖ కొన్ని వ్యాఖ్యలను చదివిన వినిపించారు. తాను ఫోన్ లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారని.. తాను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించినట్లు ఆమె వ్యాఖ్యానించారన్నారు. తన వల్ల పెళ్ళీలు బ్రేక్ అవుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిపారు.