KTR: కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది.. కానీ సిట్ విచారణకు మాత్రం ముగింపులేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కేటీఆర్ సిరిసిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్.. పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. టీవీ సీరియల్‌ను తలపించేలా డ్రామాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నాం.. పరాజయం తప్పదన్న భయంతో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు.. కొన్ని జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారని.. ప్రజల సౌలభ్యం కోసమే మేము కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
READ MORE: Himanta Biswa Sarma: రాహుల్, ప్రియాంకా గాంధీల మధ్య గొడవకు “బాధితుడిని” నేనే..
తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్.. కిషన్‌రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యమేస్తుందన్నారు. దొరికిన దొంగ ఇక్కడే ఉంటే కంప్లెయింట్ చేయాలి అంటున్నారు.. మోడీ అమిత్ షా వచ్చి తెలంగాణలో అవినీతి అంటారు.. అరెస్ట్ చేయాల్సిన వారే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని విమర్శించారు. “మా ఎమ్మెల్యేలను కొంటూ ఓ వ్యక్తి బ్యాగులతో దొరికారు.. పోలీసులు అటువంటి విషయాలపై దృష్టి పెట్టి ట్యాప్ చేసి ఉండొచ్చు.. ఫోన్ ట్యాపింగ్ 1952 నుంచి పోలీసులు చేస్తున్నారు.. ప్రభుత్వాల కోసం.. భద్రత కోసం రొటీన్‌గా జరిగేది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి ట్వీట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. కేంద్రం దేశ భద్రత కోసం ఫోన్లు ట్యాప్ చేస్తాది.. అది ఆయనకు తెలియదు కావచ్చు.. ముగ్గురు మంత్రుల మధ్య వాటాల పంచాయతీ లో ముగ్గురు జర్నలిస్ట్ లు బలయ్యారు.. మేము అధికారంలోకి వచ్చాక అధికారులు ఇబ్బందులు పడతారు.. రేవంత్ సర్కార్ లో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని అధికారులు చెప్పగలరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
READ MORE: Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్.. ఏకంగా 199 సెంచరీలు!
