KTR – Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్‌ను సిట్ దాదాపు 3గంటల పాటు విచారించింది.. ఈ విచారణలో భాగంగా మొత్తం పదకొండు ప్రశ్నలను సిట్ అధికారులు కేటీఆర్‌కు అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ సమాధానం ఇచ్చారా? ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ.. కేటీఆర్‌కు సిట్ అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అందింది. కింద పేర్కొన్న 11 ప్రశ్నలను సిట్ అడిగినట్లు సమాచారం!
READ MORE: Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ రావిపూడి సెన్సేషనల్ అప్‌డేట్!”
1. BRS పార్టీ కి వచ్చిన విరాళాలు ఎన్ని.. 2023 ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాలు వివరాలు చెప్పండి ?
2. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీకు చెక్ పవర్ ఉంటుంది, ఆర్థిక వివరాలు మీకు తెలిసి ఉంటాయి.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని కోట్లు వచ్చాయి.
3. సంధ్య శ్రీధర్ రావు ద్వారా 12 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయా ?లేదా?
4. SBI చీఫ్ ప్రభాకర్ రావు బృందం తో బ్లాక్ మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా లేదా ?
5. సిరిసిల్ల లో వార్ రూమ్ ఏర్పాటు ఎందుకు చేశారు.. అక్కడ వార్ రూమ్ లో జరిగిన వ్యవహారాలు ఏంటి ?
6. సిరిసిల్ల వార్ రూమ్ కేంద్రంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా వ్యాపారులు ఫోన్లు ట్యాపింగ్ ఎందుకు చేశారు ?
7. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుండి తెప్పించిన సాఫ్ట్ వేర్ కోసం BRS పార్టీ అకౌంట్ నుండి డబ్బులు వెళ్లాయి కదా?
8. మీకు ఛానెల్ ఎండీ శ్రవణ్ రావు కి ఉన్న పరిచయం ఏంటి ? ఛానెల్ వార్ రూమ్ లో ఏమి జరిగింది ?
9. 2023 ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు , ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్స్ ట్యాపింగ్ పై ఏమి చెప్తారు ?
10. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధకిషన్ రావు తో మీరు ఎన్నికల సమయంలో వాట్సప్ , సిగ్నల్ యాప్స్ ద్వారా అన్ని సార్లు ఎందుకు మాట్లాడారు
11. సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు అనుకుంటున్నారు… దానిపై ఏమి చెప్తారు.
