Site icon NTV Telugu

KTR : అమెరికా, లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

Ktr

Ktr

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా జూన్ 1న డల్లాస్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీనికోసం అక్కడి బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Airtel vs Jio: ఎంట్రీ లెవల్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లలో ఏది బెస్ట్ ఛాయిస్..?

లండన్ పర్యటనలో భాగంగా ‘ఇండియా వీక్ 2025’లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. అంతేకాకుండా, మే 30న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటోమోటివ్ బ్రాండ్లు.. మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లకు ఆర్&డి సేవలు అందించే పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

Emirates Draw : లాటరీలో 231 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తిన చెన్నై వ్యక్తి..!

అంతర్జాతీయ పర్యటనలో భాగంగా కేటీఆర్ వివిధ దేశాల మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులతో కూడా సమావేశమవ్వనున్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (UT Dallas)లోని భారతీయ విద్యార్థులతో సమావేశమై, నూతన ఆవిష్కరణలు, స్టార్ట్‌అప్స్, భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్రపై ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయగా, అదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version