NTV Telugu Site icon

KTR: అనుకోకుండా ఒక మాట తొర్లాను.. కేటీఆర్ కామెంట్స్..

Ktr

Ktr

KTR Comments: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా.. ఆయనను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఇకపోతే, రాష్ట్ర ‍మహిళా కమిషన్‌ (బుద్ధ భవన్‌) ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనకు ఉమెన్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లిగా నిరసన సెగ తగిలింది.

Kolkata Doctor Murder Case: ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో మరో 6 మందికి పాలిగ్రఫీ పరీక్షలు..

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను ఒక మీటింగ్ లో అనుకోకుండా ఒక మాట తొర్లాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఇప్పటికే మహిళా మణులకు క్షమాపణ చెప్పాను. ఈ విషయం పై మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది. అందుకోసం మహిళా కమీషన్ క్షమాపణ కోరాను. మహిళా కమీషన్ దృష్టికి ఈ 6 నెలల నుంచి జరిగిన విషయాలు కూడా చెప్పాలనుకున్నాం. కానీ., వాటిపై మళ్లీ వచ్చి కాలవాలని చెప్పారు. మా మహిళా నాయకురాల్ల మీద కాంగ్రెస్ మహిళ నేతలు దాడులు చేశారు. దీనిని మహిళ కమీషన్ సుమోటోగా తీసుకొని కేస్ బుక్ చేయాలని ఆయన అన్నారు.