రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. ఇక, కేటీఆర్ మాట్లాడుతూ.. నాకు జన్మనిచ్చింది నా తల్లి.. రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల.. భారతదేశంలోనే నెంబర్ వన్ గా సిరిసిల్ల నియోజకవర్గంగా మార్చుతాను.. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో కర్ఫ్యూ లేదు.. ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుంది.. వందల ప్రాణాలు తీసింది కాంగ్రెస్.. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం బ్రతిమిలాడే పరిస్థితి.. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. తేలిపోయే మోటార్లు.. ఆదిక్కుమాలిన పాలన మళ్లీ కావాలా..? గుర్తు చేసుకోండి అని మంత్రి కేటీఆర్ అడిగారు.
Read Also: Kishan Reddy: ఎంఐఎం ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది..
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే వారి మాయలో పడొద్దు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏం అభివృద్ధి చేశారో ఆలోచన చేయాలి.. 93 లక్షల మందికి 5 లక్షల కేసీఆర్ బీమా ఇవ్వబోతున్నాం.. భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది.. మళ్లీ గెలిస్తే 4 కొత్త పథకాలు ప్రవేశపెట్టబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మళ్లీ తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే.. డీకేలు పీకేలు ఎంతమంది వచ్చినా విజయం మాదే.. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం అందించబోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: Muralidhar Rao: వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే..!
400 రూపాయలకే సిలిండర్ అందించబోతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 1.63 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ పెట్టించే బాధ్యత నేనే తీసుకుంటాను ఆయన తెలిపారు. ఒక కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి.. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది.. 30 తారీఖు నాడు కేసీఆర్ కూడా సెంచరీ కొట్టాలి.. మూడవసారి ముఖ్యమంత్రి కావాలి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.