KTR: “మైనింగ్‌లో భారీ అవినీతి జరిగింది”.. సభా సంఘం వేయాలని కేటీఆర్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మంత్రి కుటుంబం స్కామ్ బయట పెట్టే వరకు ప్రభుత్వం బిత్తర పోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాటలాడారు. అక్రమ మైనింగ్ పై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ చేస్తున్న కంపెనీలో మంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన విచారణ సాఫీగా జరగాలని కోరుతున్నామన్నారు. విచారణ సాఫీగా జరగాలంటే మంత్రి రాజీనామా చేయాలన్నారు. అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని.. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులది ముఖ్యమంత్రి అంటున్నారన్నారు. 2020- 22 వరకు పొంగులేటి ఛైర్మన్ అని తెలిపారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను రేవంత్‌రెడ్డి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. రెండున్నర ఏళ్లుగా ప్రజలకు పనికి వచ్చే ఒక పని కూడా చేయట్లేదని విమర్శించారు. మంత్రిగారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
మంత్రి కుటుంబన్ని ఎందుకు కాపాడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.. మైనింగ్ మంత్రి సిగ్గు పడాలన్నారు. “ఎన్ని కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట్‌లో ముఖ్యమంత్రి బంధువులది. రూ. 1800 కోట్లు ఆదాయం రావాలి. వస్తున్నది రూ. 900 కోట్లు. మిగతావి ఎవరి జేబులోకి పోతున్నవి. వేయి కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బిజెపి ఆడుతుంది. ప్రవేట్ భూములలో గుండాలను వేసుకొని కబ్జా చేస్తున్న దాన్ని కూడా మేము వదిలిపెట్టం. మెట్రో పై స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉంది. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 280 ఎకరాల ఎల్ అండ్ టీకి లీజుకి ఇచ్చాం. ఆ భూమి నీ కొట్టేయడానికి దండు పాల్యం బ్యాచ్ కుట్ర. వాటిని మీ అన్యాయాలకు కట్టబెడతారా..? రాయదుర్గం వద్ద మెట్రోకి కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది? ఎల్ అండ్ టీ Cfo నీ జైలులో వేస్తామని బెదిరించారు. ఇది పెద్ద కుంభకోణం. ప్రభుత్వం వినక పోతే గవర్నర్‌ను కూడా కలుస్తాం. గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తాం.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
- Tags
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?