KTM: ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంస్థగా ఎదిగిన కేటీఎమ్ (KTM).. తాజాగా మూడు కొత్త అడ్వెంచర్ బైక్‌లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్ ను గమనిస్తే.. 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X పేర్లతో భారతీయ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సిద్ధం అయ్యింది. KTM, బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో భారతదేశంలో చాలా సమయం నుండీ ప్రముఖమైన స్పోర్ట్స్ బైక్‌లు అందిస్తోంది. అయితే, ఈ అడ్వెంచర్ మోడల్స్ యూత్‌ను ఆకట్టుకునేలా అద్భుతమైన డిజైన్‌తో వస్తున్నాయి.
Read Also: Machine Learning Course: ఫ్రీ.. ఫ్రీ.. మెషిన్ లెర్నింగ్ కోర్సును ఉచితంగా నేర్పిస్తున్న గూగుల్
KTM 250 అడ్వెంచర్:
కేటీఎం 250 అడ్వెంచర్ రోడ్డెక్కి ప్రయాణించేందుకు అనువైన బైక్‌గా రూపొందింది. సస్పెన్షన్ సిస్టం ద్వారా కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. 250 అడ్వెంచర్‌ను 227mm గ్రౌండ్ క్లియరెన్స్, 825mm సీట్ ఎత్తుతో అందించారు. తద్వారా కొండలు, ఎత్తు ప్రాంతాలలో కూడా రయ్ మంటూ దూసుకుపోవచ్చు. దీని ధర రూ.2,59,850 (ఎక్స్ షోరూమ్ ధర). ఇందులో ABS, బైక్ రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్ ప్లస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
KTM 390 అడ్వెంచర్:
390 అడ్వెంచర్, స్పోర్టీ లుక్‌తో కన్పిస్తుంది. 390cc ఇంజిన్‌తో ప్రయాణికులకు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 45.3 bhp పవర్, 39 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.3.68 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర). ఈ బైక్ 21 అంగుళాల ముందు వీల్స్, 17 అంగుళాల వెనుక వీల్స్‌తో వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 5-అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్, కార్నరింగ్ ABS వంటి ఫీచర్లతో కూడుకున్న ఒక ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
Read Also: BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోన్న BSNL.. రూ.1515కే ఏడాదిపాటు!
KTM 390 అడ్వెంచర్ X:
390 అడ్వెంచర్ X అప్‌గ్రేడెడ్ వర్షన్‌లకు క్రమంగా అనుకూలంగా ఉండి కొండలు, గుట్టలు, మరియు సాధారణ రోడ్లపై సాఫీగా ప్రయాణించడానికి రూపొందించబడింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్, సీటు ఎత్తు 250 అడ్వెంచర్‌ను పోలి ఉంటాయి. కాని దీనిలో స్పోక్డ్ వీల్స్‌కు బదులుగా కాస్ట్ వీల్స్‌ను అందించారు. దీని ధర రూ.2,91,140 (ఎక్స్ షోరూమ్ ధర). KTM తన 390 అడ్వెంచర్ X మోడల్‌ను తక్కువ ధరలో అందించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది. భారతదేశంలో అడ్వెంచర్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఈ కొత్త మోడల్స్ టూరింగ్, ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ఉత్తమమైన ఎంపికగా నిలిచాయి. మొత్తంగా KTM 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్, మరియు 390 అడ్వెంచర్ X లు కేవలం మోటార్‌సైకిల్స్ మాత్రమే కాకుండా, ప్రయాణానికి కొత్త పరిమాణం తెచ్చే ప్రత్యేకమైన ఫీచర్లతో ఉన్నాయి.