NTV Telugu Site icon

Lawrence Bishnoi: ఓపెన్ ఆఫర్.. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన వారికి భారీ రివార్డ్ ప్రకటించిన కర్ణిసేన

Lawrence Bishnoi

Lawrence Bishnoi

Lawrence Bishnoi: క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసినందుకు అతను కోటి రూపాయలకు పైగా రివార్డును ప్రకటించాడు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని చెప్పారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య లారెన్స్ బిష్ణోయ్ ద్వారా జరిగిందని ఆయన వీడియోలో తెలిపారు. అలాగే మనకు, దేశప్రజలకు భయం లేని భారతదేశం కావాలి, భయంకరమైనది కాదని తెలిపారు.

YS Jagan: ప్రేమోన్మాది చేతిలో బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..

నిజానికి సోషల్ మీడియాలో గోగమేడి హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. గోగమేడిని రెండు మూడు సార్లు హెచ్చరించినా వినలేదని అన్నారు. అందుకే కాల్చానని తెలిపాడు. ఇకపోతే, క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ వీడియోను విడుదల చేసి ఎన్‌కౌంటర్‌కు రివార్డు ప్రకటించారు. ఈ వీడియోలో, లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు సిబ్బందికి రూ.1,11,11,111 (కోటి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల పదకొండు) ఇస్తానని రాజ్ షెకావత్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. మన క్షత్రియ కర్ణి అమూల్యమైన రత్నం, వారసత్వ అమరవీరుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపినా వారిని కారకులైన వారిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు సేన ఈ మొత్తాన్ని అందజేస్తుందని తెలిపారు. అలాగే ఆ ధైర్యవంతుడైన పోలీసు కుటుంబానికి భద్రత, పూర్తి ఏర్పాట్లకు కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పుకొచ్చారు.

Sonam Wangchuk: 16 రోజుల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష విరమణ

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చాలా కాలంగా గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. దసరా రోజున ముంబైలోని బాంద్రాలో బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యాడు. మరుసటి రోజు, ఫేస్‌బుక్ పోస్ట్‌లో లారెన్స్ గ్యాంగ్ హత్యకు బాధ్యత వహించింది. ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన 15 బృందాలు ఈ హత్యను విచారిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో ఇద్దరు షూటర్లు సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత నటుడు సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై పోలీసుల ట్రాఫిక్ వాట్సాప్ గ్రూప్‌లో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కూడా వచ్చాయి. వీటన్నింటి మధ్య క్షత్రియ కర్ణి సేన ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌పై ఫ్రంట్ ప్రారంభించింది.

Show comments