Site icon NTV Telugu

Krithika Infra Developers: ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం.. రూ. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్

Krithika

Krithika

హైదరాబాదులో మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కోట్లలో వసూలు చేసి భారీ మోసానికి పాల్పడింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టిఅన్నారంలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలు చేసి బురిడీ కొట్టించింది. కోట్ల రూపాయల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ.. కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌ ముందు బాధితులు క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version