బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా నిలిచారు. ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు. ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థలు మహిళల ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదని.. దీనిని మానవాళి పురోగతి శ్రేయస్సు, భవిష్యత్తుకు మూలస్తంభంగా పరిగణించాలన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది మహిళలే ఉన్నారని, వారి వైద్యానికి సరిపడా నిధులు లేవని కృతి అన్నారు. హీరోయిన్ కృతి తన ప్రభావంతమైన ప్రసంగంతో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నారు.
Also Read: Daily Horoscope: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
‘మహిళల ఆరోగ్యం, లింగ సమానత్వం కోసం పెట్టుబడి పెట్టడం నైతిక ఆవశ్యకత మాత్రమే కాదు భవిష్యత్తులో ఒక వ్యూహాత్మక పెట్టుబడి. ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాలు, సంఘాలు, ఆర్థిక వ్యవస్థలను రూపొందిస్తారు. ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన కార్యకలాపాలలో మహిళలు చురుకుగా పాల్గొనాలి. బాల్య వివాహం, ప్రసూతి సంరక్షణ లాంటి అంశాల్లో మార్పులను సృష్టించాలంటే ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలి’ అని కృతి సనన్ కోరారు. ‘ఆమె లేకుండా ఏమీ లేదు’ అనే సూత్రాన్ని కృతి బలోపేతం చేశారు. కృతి తాజాగా నటించిన ‘తేరే ‘తేరే ఇష్క్ మే’ సినిమా నవంబరు 28న రిలీజ్ కానుంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి ఎంపికైన విషయం తెలిసిందే.
