Site icon NTV Telugu

Perni Nani vs SP: సరైన పద్ధతి కాదు.. పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ సీరియస్!

Perni Nani Vs Sp

Perni Nani Vs Sp

మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఆర్ పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నాం. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎస్‌హెచ్‌వో ఛాంబర్‌లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఎస్పీ విద్యాసాగర్ చెప్పారు.

Also Read: Vidadala Rajini: ‘ఆరోగ్యశ్రీ’ అనారోగ్యశ్రీగా మారిపోయింది.. కూటమి ప్రభుత్వం పెయిల్ అయింది!

‘పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. పోలీస్ స్టేషన్‌కు రావడం తప్పులేదు. ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. అంతేగానీ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకుని వెళ్లిపోతా అనడం సరికాదు. పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. మేం కూడా అదే గౌరవంతో మాట్లాడుతాం. గ్రూపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైన పద్ధతి కాదు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు.

Exit mobile version