Site icon NTV Telugu

TDP: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు..

Kotla

Kotla

TDP: కేంద్రమంత్రి మాజీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.. దీంతో ఆయన హూటాహూటిన విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే డోన్ సీటును కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం.. ఇక, డోన్ ఇంఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా గతంలో ప్రకటించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. కానీ, కొన్ని రాజకీయ పరిస్థితులను బేరీజు చేసిన తర్వాత.. ఇప్పుడు అభ్యర్థిని మార్చి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేస్తోంది.. మరోవైపు.. డోన్‌ ఇంఛార్జ్‌గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ అధిష్టానం నచ్చ చెప్పింది.

Read Also: CPI Narayana: ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు!

ఇక, కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఆలూరు అసెంబ్లీ సీటు కోరింది. కానీ, టీడీపీ అధిష్టానం మాత్రం డోన్ సీటు ఖరారు చేసిందట.. దీనిని అధికారికంగా ప్రకటించే ముందు కోట్లతో చర్చించేందుకు పిలిచినట్టుగా చెబుతున్నారు.. డోన్ ప్రస్తుత ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లే విషయంపై టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు ఇవ్వనుందని సమాచారం.. మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ.. ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతూ పోతోంది..

Exit mobile version