NTV Telugu Site icon

Koti Deepotsavam 2nd Day: ఘనంగా కోటి దీపోత్సవం.. రెండోరోజు కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2nd Day: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవ యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది.. తొలి రోజు ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి.. శ్రీశైలం మల్లన్న కల్యాణాన్ని చూసి తరించారు భక్తులు.. తొలి రోజే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోతవ్సం వేదిక జనసంద్రంగా మారిపోయింది.. ఇక, రెండో రోజు కోటిదీపోత్సవంలో నిర్వహించే విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు..

భక్తి టీవీ కోటిదీపోత్సవం వేదికగా రెండో రోజు జరిగే విశేష కార్యక్రమాలు..

* శివతనయుల వైభవం

* భక్తులచే కాజీపేట శ్వేతార్కమహాగణపతికి కోటిగరికార్చన

* ఒకే వేదికగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

* మూషిక వాహనంపై లంబోధరుడు, మయూర వాహనంపై సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం

* హోస్పెట చింతామణి మఠం శ్రీనివానంద భారతిస్వామి అనుగ్రహభాషణం

* హైదరాబాద్‌ ఆర్షవిద్యా గురుకులం శ్రీపర్వవిదానందసరస్వతిస్వామి అనుగ్రహభాషణం

* బ్రహ్మకుమారీస్‌ జర్మనీ రాజయోగిని సుధేశ్‌ దీదీజీ అనుగ్రహభాషణం

* శ్రీకాకునూరి సూర్యనారాయణమూర్తి ప్రవచనామృతం

* కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు, లింగోద్భవ వైభవం, మహాదేవునికి మహానీరాజనం, అద్భుత సాంస్కృతిక కదంబం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న దీపయజ్ఞం కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్..

 

Show comments